చుట్ట కాలుస్తూ విషాదం.. మంటల్లో మహిళ మృతి
విజయనగరం జిల్లా గాజులరేగలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంటి వద్ద చుట్ట కాల్చుకుంటున్న పి. నారాయణమ్మ (54) చీరకు అగ్ని అంటుకోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించినా, చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందారు. ఆమె కుమారుడు మహేష్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.