చిన్నతుంబళంలో రీ సర్వే ప్రక్రియపై గ్రామసభ

KRNL: పెద్దకడబూరు మండలంలోని చిన్నతుంబళం గ్రామంలో రీ సర్వే ప్రక్రియపై రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్ లలిత కుమారి ఆధ్వర్యంలో శనివారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గీతా ప్రియదర్శిని మాట్లాడుతూ.. గ్రామంలో రైతుల భూములకు సంబంధించి రీ సర్వే ప్రక్రియ పూర్తయిందన్నారు. రీ సర్వేలో ఏవైనా సమస్యలు ఉంటే రైతులు తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.