EAPCET: తొలిరోజు 93.87 శాతం హాజరు

TG: EAPCET ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు నిన్న ప్రారంభమయ్యాయి. తొలిరోజు 74,205 మందికి.. 69,658 మంది(93.87 శాతం) హాజరయ్యారు. షిఫ్ట్-1 పరీక్షలో గణితంలోని 80 ప్రశ్నల్లో 8 ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని, గతేడాదితో పోలిస్తే కొంత సులభంగా ఉందని ఓ ప్రొఫెసర్ తెలిపారు. రసాయన శాస్త్రంలో 3 ప్రశ్నలు కఠినంగా ఉన్నాయని, సగటు విద్యార్థి 60-70 మార్కులు తెచ్చుకోవడం కూడా కష్టమేనని అభిప్రాయపడ్డారు.