ధర్మవరంలో వృద్ధురాలికి స్క్రబ్ టైఫస్

ధర్మవరంలో వృద్ధురాలికి స్క్రబ్ టైఫస్

సత్యసాయి: ధర్మవరంలోని శాంతినగర్‌కు చెందిన 78 ఏళ్ల వృద్ధురాలు స్క్రబ్ టైఫస్ బారిన పడింది. ఈ నెల 8న తీవ్ర జ్వరం, ఇతర నొప్పులతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఆమెకు నడుముపై నల్లటి మచ్చను వైద్యులు గుర్తించారు. ఐజీఎం ఎలిసా పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం వృద్ధురాలికి ధర్మవరం ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు.