ప్రియుడు మోసం చేశాడని యువతి ధర్నా
MNCL: కాసిపేట మండలంలోని సోమగూడెంలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా చేపట్టింది. ప్రేమించి పెళ్లి చేసుకుంటామని నమ్మించి ప్రియుడు మోసం చేశాడని బాధిత యువతి ఆరోపిస్తోంది. ఈ నెల 28న ప్రియుడికి వివాహం ఖరారవడంతో ధర్నాకు దిగింది. ఆమెకు మహిళా సంఘాలు మద్దతు ప్రకటించాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ జరుపుతున్నట్లు సమాచారం.