'పిల్లలను స్క్రీన్ లకు దూరంగా ఉంచాలి'
ASR: అరకులోయ ఏరియా ఆసుపత్రిలో గురువారం '8వ పోషణ్ పక్వాడా' కార్యక్రమాన్ని తహసీల్దార్ కుమారస్వామి, సూపరింటెండెంట్ డాక్టర్ రాము ప్రారంభించారు. చిన్నారులను సెల్‌ఫోన్ స్క్రీన్లకు దూరంగా ఉంచి, ఆటపాటలు, కథలతో వారిని ప్రోత్సహించాలని సూచించారు. అంగన్‌వాడీల్లో నిర్వహించే ఈ పక్షోత్సవాల్లో తల్లిదండ్రులు పాల్గొని పిల్లల ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలని CDPO లక్ష్మీ లావణ్య కోరారు.