పోలీసు వేధింపులతో యువకుడి ఆత్మహత్యాయత్నం

MLG: మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన నిమ్మల వినయ్ (26) అనే యువకుడు పోలీసుల వేధింపులు భరించలేక బ్లేడుతో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మంగపేట ఎస్సై సూరి అక్రమంగా కేసులు బనాయించాడని మనస్తాపం చెంది వినయ్ ఈ చర్యకు పాల్పడ్డాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.