4న ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరం
VZM: విజయనగరం పుష్పగిరి నేత్ర వైద్యశాల వారి సహకారంతో మంగళవారం ఉచిత మెగా నేత్ర వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు మానవీయత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు బి.వి గోవిందరాజులు తెలిపారు. చీపురుపల్లి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బిల్డింగ్‌లో ఉ 9:30 నుంచి మ.2 గంటల వరకు ఈ శిబిరం నిర్వహించనున్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.