VIDEO: 'సేవా పక్షం కార్యక్రమాలను విజయవంతం చేయండి'

NRML: సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు ప్రధాని మోదీ జన్మదినం సందర్బంగా సేవా పక్షం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు భైంసా టౌన్ బీజేపీ అధ్యక్షులు రావుల రాము తెలిపారు. 17న రక్తదాన శిబిరం, 18న చిత్రలేఖనం,స్వచ్ఛ భారత్, 25న మొక్కలు నాటడం, 27న దివ్యాంగులకు సన్మానం, ఉపకరణాల పంపిణీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.