మట్టి గణపతి విగ్రహాలను పూజించాలి: ఎస్సై

మట్టి గణపతి విగ్రహాలను పూజించాలి: ఎస్సై

WNP: పర్యావరణ రహితమైన మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని వనపర్తి రూరల్ ఎస్సై జలంధర్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల పర్యావరణం కలుషితం అవుతుందని, దీని నివారణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించాలని కోరారు. వినాయకుడిని మట్టితో తయారు చేసి పూజించడం ద్వారానే సత్ఫలితాలు లభిస్తాయని, మన ఆకాంక్షలు నెరవేరుతాయని అన్నారు.