విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: కలెక్టర్
BHPL: మొగుళ్లపల్లి మండలం ఇసిపేట ప్రభుత్వ పాఠశాలను ఇవాళ కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మికంగా సందర్శించి, తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ 7వ తరగతి విద్యార్థులతో ముచ్చటించి చదువు వివరాలు, రాగి జావ తాగారా అని ప్రేమగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రం, మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు.