'విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తాం'

'విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తాం'

SCRL: జిల్లాలోని అన్ని గ్రామాలలో విద్యుత్ అధికారులు రైతు పొలం బాట కార్యక్రమాన్ని చేపడుతున్నారని సిరిసిల్ల సూపర్‌డెంట్ ఇంజనీర్ బిక్షపతి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని రైతులతో మాట్లాడి వారికి విద్యుత్ పట్ల అవగాహన కల్పిస్తున్నామన్నారు. వారి సమస్యలను విని త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు.