VIDEO: పెన్షన్ డబ్బుల్లో బీపీఎం చేతి వాటం: గ్రామస్థులు

NRML: భైంసా మండలం దేగాంలో బీపీఎం ఆసరా పింఛన్ డబ్బుల్లో కట్ చేస్తున్నారని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పోస్ట్ ఆఫీస్‌లో పెన్షన్ దారులు బీపీఎంపై మండిపడ్డారు. 4నెలల నుంచి రూ.2 వేలు ఇచ్చి రూ.16 కట్ చేస్తున్నాడని ఆరోపించారు. ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నాడని వాపోయారు. నెలలో ఒకే రోజు పింఛన్ ఇస్తూన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.