అకాల వర్షంతో ఇటుక బట్టీలకు అపార నష్టం

NTR: జీ.కొండూరు పరిసరాల్లో ఆదివారం కురిసిన అకాల వర్షం వల్ల తీవ్ర నష్టం కలిగిందని ఇటుక బట్టీల వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. కాల్చేందుకు సిద్ధంగా ఉంచిన ఇటుకలు నీటిపాలయ్యాయి. చిన్న తరహా ఇటుక బట్టీల యజమానులు భారీగా నష్టపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.