ఎస్కేయూ క్యాంటీన్‌లో ధరల పెంపుపై ఇంఛార్జ్ వీసీకి వినతి

ఎస్కేయూ క్యాంటీన్‌లో ధరల పెంపుపై ఇంఛార్జ్ వీసీకి వినతి

ATP: ఎస్కే యూనివర్సిటీలోని జన్మభూమి క్యాంటీన్‌లో టెండర్ల ధరలకు విరుద్ధంగా అధిక ధరలు వసూలు చేస్తున్నారని వైసీపీ విద్యార్థి విభాగం నాయకుడు చిగండి రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. భోజనం రూ. 80, చపాతీ రూ. 50 చొప్పున అమ్ముతున్నారని, పేద విద్యార్థులు కొనలేని ధరలను నిర్ణయించారని మండిపడ్డారు. ఈ మేరకు ఇంఛార్జ్ వీసీ బి.అనితకు వినతిపత్రం అందజేశారు.