విషాదం.. బతుకమ్మ ఆడుతూ మహిళ మృతి
NRML: బతుకమ్మ ఆడుతూ మహిళా మృతి చెందిన ఘటన నిర్మల్ పట్టణంలోని బంగల్ పేట్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పట్టణంలోని బంగల్ పేట్ కాలనీకి చెందిన బిట్లింగు భాగ్యలక్ష్మి (56) డీజే వద్ద బతుకమ్మ ఆడుతూ అస్వస్థతకు గురైంది. వెంటనే స్థానికులు ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది. డిజె సౌండ్ కారణంగానే గుండెపోటు సంభవించినట్లు వైద్యులు తెలిపారు.