VIDEO: మత్స్యపురిలో వైభవంగా అమ్మవార్ల జాతర
పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం మత్స్యపురిలో ఉన్న పెన్నమ్మ, మారమ్మ, వెంకమ్మ, పోలేరమ్మ, మహాలక్ష్మమ్మ జాతర మహోత్సవాలు గురువారం ఘనంగా ముగిసాయి. తాళమేళాలు, వివిధ రకాల వాయిద్యాలతో సాగిన ఊరేగింపు కన్నుల పండుగగా జరిగింది. గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కమిటీ సభ్యులు ముందస్తు చర్యలు తీసుకున్నారు.