మహా సరస్వతి దేవిగా కాళికా దేవి

MDK: పట్టణం అరబ్ గల్లీలో వెలిసిన కాళికామాత దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. బుధవారం 7వ రోజు అమ్మవారు మహా సరస్వతిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకాలు తీర్థ ప్రసాద వితరణ గావించారు. ఆలయ ప్రధాన అర్చకులు శివరామాచారి ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయి.