సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

ELR: టీ.నరసాపురం మండలం జగ్గవరం హై స్కూల్లో విద్యార్థులకు మహిళల భద్రత, శక్తి యాప్ వినియోగం, సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఎస్సై జయబాబు మాట్లాడుతూ.. మోడరన్ కమ్యూనికేషన్ వేదికలను వాడకంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిపై చట్టబద్ధమైన పరిష్కార మార్గాలు వివరించారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలను పాటించాలన్నారు.