VIDEO: గౌతు లచ్చన్న చిత్రపటానికి నివాళి
కృష్ణా: స్వాతంత్య్ర సమరయోధుడు గౌతు లచ్చన్న వర్ధంతి వేడుకలు గుడివాడ టీడీపీ కార్యాలయంలో ఆదివారం జరిగాయి. లచ్చన్న చిత్రపటానికి టీడీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర సమరయోధుడిగా, బడుగు బలహీన వర్గాలు, రైతు, కార్మిక నాయకుడిగా అనేక ఉద్యమాలు సాగించారని టీడీపీ నేతలు అన్నారు. నమ్మిన సిద్ధాంతాల కోసం పోరాడిన మహా నాయకుడు లచ్చన్న అని కొనియాడారు.