జిల్లా దేశానికే ఆదర్శం కావాలి: జిల్లా కలెక్టర్

భద్రాద్రి జిల్లా కేవలం ఆకాంక్షిత జిల్లాగానే కాకుండా, దేశానికే ఆదర్శంగా నిలిచే స్ఫూర్తివంతమైన జిల్లాగా మారాలని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. మంగళవారం కొత్తగూడెం ఐడీవోసీ కార్యాలయంలో జరిగిన జిల్లా స్థాయి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి శాఖ సమన్వయంతో కృషి చేయాలని అధికారులకు సూచించారు.