పేదల అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి ఎన్టీఆర్

పల్నాడు: వినుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ 101వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జున రావు పాల్గొని,ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మక్కెన మాట్లాడుతూ.. పేద, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు.