సికింద్రాబాద్ బ్లూసీ వెనక భూమిని కాపాడాలని హైడ్రాకు వినతి

సికింద్రాబాద్ బ్లూసీ వెనక భూమిని కాపాడాలని హైడ్రాకు వినతి

HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని బ్లూసీ హోటల్ వెనుక ఉన్న 2 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా కాపాడాలని స్థానికులు హైడ్రా 'ప్రజావాణి' లో ఫిర్యాదు చేశారు. కొందరు వ్యక్తులు ఈ భూమిని కాజేసేందుకు పరస్పరం కేసులు వేసుకుంటూ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. కిక్కిరిసిన జనాభా ఉన్న ఈ ప్రాంతంలో ఆ భూమిని స్వాధీనం చేసుకుని, పార్కుగా అభివృద్ధి చేయాలన్నారు.