బీర్ బాటిల్‌పై వేరే కంపెనీ మూత
AP: కృష్ణా జిల్లా కాజా గ్రామంలో కల్తీ మద్యం వ్యవహారం కలకలం రేపుతోంది. ఒక ప్రముఖ బ్రాండ్ బీర్ బాటిల్‌కు మరో బ్రాండ్ మూత ఉండటాన్ని గమనించిన వినియోగదారుడు షాపు సిబ్బందిని నిలదీశాడు. స్టాక్ అలాగే వచ్చిందని, సీసీ కెమెరాలు పనిచేయడం లేదని సిబ్బంది బదులిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్ కావడంతో కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.