అనాథ శవాలకు అంత్యక్రియలు
NZB: రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది గుర్తించిన అనాథ శవానికి అంత్యక్రియలను నిర్వహించాలని ఇందూరు యువత స్వచ్ఛంద సంస్థను కోరారు. దీంతో వారు సంప్రదాయ పద్దతిలో నిన్న సాయంత్రం అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు, కోశాధికారి జయదేవ్ వ్యాస్, యూవీ ఫౌండేషన్ మెంబర్ సతీష్ ఉన్నారు.