పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
MDK: రుచి కోసం కాదు ఆరోగ్యం కోసం ఆహారం తీసుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి సూచించారు. చిలిపి చెడ్ మండల కేంద్రంలో సోమవారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ మహోత్సవం, బాల్యవివాహాల నిషేధ చట్టం అమలుపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఆడపిల్లలను చదివించి ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా చూడాలన్నారు.