ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్
HNK: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. న్యూ శాయంపేటలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం సాయంత్రం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరాతీసారు. టీబీ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కోరారు.