VIDEO: ఒకే రోజులో పార్టీ మారిన దసురు తండావాసులు
MHBD: తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డుకు చెందిన దసురు తండావాసులు ఒకే రోజు తేడాతో రెండు పార్టీలకు మారడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఆదివారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన వారు, సోమవారం టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామం ఆసక్తిగా మారింది.