వాహనాలు ఢీకొని యువకులకు గాయాలు
PLD: పెదకూరపాడుకు చెందిన ముస్లిం కాలనీ యువకులు ద్విచక్ర వాహనాలపై ఎదురెదురుగా ఢీకొనిగా ఇరువురికి గాయాలయ్యాయి. సోమవారం మధ్యాహ్నం సినిమా హాల్ సెంటర్లోని లవ్ లెవల్ బ్రిడ్జి వద్ద ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. ఇస్మాయిల్‌కు బలమైన గాయాలు కావడంతో 108 వాహనం ద్వారా మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.