అమరావతి దేశంలోనే ఉత్తమ రాజధాని అవుతుంది: శ్రీదేవి

GNTR: అమరావతి దేశంలోనే అత్యుత్తమ రాజధానిగా రూపుదిద్దుకుంటోందని మాదిగ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీదేవి అన్నారు. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. పునర్నిర్మాణ ప్రారంభోత్సవం ప్రజా సమూహాలతో వైభవంగా సాగిందన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ కృషితో అమరావతి పునరుత్థానం జరుగుతోందని తెలిపారు. జగన్ హయాంలో అమరావతి నిర్లక్ష్యానికి గురైందన్నారు.