"ఘనంగా ముగిసిన బుగులోని జాతర"
BHPL: తిరుమలగిరి గ్రామ శివారు బుగులోని వెంకటేశ్వర స్వామి జాతర శనివారం ఘనంగా ముగిసింది. పచ్చని చెట్లు, ప్రకృతి అందాల నడుమ ఆధ్యాత్మిక శోభతో జరిగిన జాతరకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు.ఈ జాతరలో ఏనుగు, మేక ప్రభలు ఆకర్షణగా నిలిచాయి. జాతర ముగింపు భాగంగా స్వామి కొండ దిగి గ్రామానికి చేరారు.