VIDEO: డ్రగ్స్, ర్యాగింగ్ చట్టరీత్యా నేరం: జిల్లా జడ్జి
ADB: విద్యార్థులు గంజాయి, డ్రగ్స్, ర్యాగింగ్‌ల బారిన పడకుండా ఉండాలని ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె. ప్రభాకర్ రావు అన్నారు. స్థానిక రిమ్స్ కళాశాలలో శుక్రవారం జరిగిన న్యాయ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి విద్యార్థులకు ర్యాగింగ్ శిక్షలు, మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై వివరించారు.