VIDEO: అస్సాం ఘటనపై పుంగనూరులో నిరసన

CTR: అస్సాంలో పేద ప్రజల, మైనారిటీల ఇళ్లను తొలగించడం పట్ల పుంగనూరులో ఎన్డీపీఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పట్టణంలోని ముడెప్ప సర్కిల్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో నాయకులు చాంద్ బాషా మాట్లాడుతూ.. అస్సాం ప్రభుత్వ వైఖరి పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్సాంలో బుల్డోజర్ రాజకీయాలు చేస్తున్నారని, సుమారు 1000 ఇళ్లకు పైగా పేద ప్రజల ఇళ్లను కూల్చివేశారని వాపోయారు.