హిందూ సాధువుకు ముస్లిం యువకుడి కిడ్నీ దానం!

మధ్యప్రదేశ్‌కు చెందిన ఆరిఫ్ అనే ముస్లిం యువకుడు మత సామరస్యాన్ని చాటుతూ తన కిడ్నీని ప్రముఖ సాధువు ప్రేమానంద్ మహారాజ్‌కు దానం చేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రేమానంద్ ప్రసంగాలు, జాతీయ ఐక్యత సందేశాలు ఆరిఫ్‌ను ఎంతగానో ప్రభావితం చేశాయి. దేశ సమగ్రత కోసం ఆయన దీర్ఘాయువుతో జీవించాలని ఆరిఫ్ కోరుకుంటున్నాడు. గొప్ప మనసుతో ఆరిఫ్ ఓ లేఖ ద్వారా తన నిర్ణయాన్ని తెలియజేశాడు.