అన్నారంలో ఘనంగా కనుమ వేడుకలు
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం గ్రామంలో శుక్రవారం ఘనంగా కనుమ పర్వదిన వేడుకలను గ్రామ సర్పంచ్ మహేందర్ ప్రారంభించారు. రేణుకా ఎల్లమ్మ ఆలయం ఆవరణలో ఎద్దులకు పూజలు చేశారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీల్లో విజేతగా నిలిచిన రియన్ షాకు రూ. 10వేల చెక్కును సర్పంచ్ మహేందర్ అందజేశారు.