వీధి కుక్కల దాడిలో గొర్రె బలి
MDK: నిజాంపేటలో వీధి కుక్కల బెడద తీవ్రమైంది. సోమవారం రాత్రి కుక్కల గుంపు ఒక గొర్రెపై దాడి చేసి చంపేశాయి. ఇటీవల ఒక లేగ దూడ కూడా కుక్కల బారిన పడటంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. సాయంత్రం తర్వాత బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొందని, పశువులతో పాటు మనుషులకూ ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.