'ఇరిగేషన్ పనుల్లో నాణ్యత పాటించాలి'

'ఇరిగేషన్ పనుల్లో నాణ్యత పాటించాలి'

W.G: ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు చేసేటప్పుడు ప్రభుత్వం ప్రజా ధనాన్ని దుర్వినియోగం కాకుండా పనులు చేపట్టాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) ఛైర్మన్, భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు అన్నారు. విజయవాడలో బుధవారం ఇరిగేషన్ శాఖాధికారులతో పీఏసీ సమావేశాన్ని నిర్వహించారు. నిర్ణీత సమయంలో కాంట్రాక్టర్లతో పనులు చేయించే బాధ్యత ఇరిగేషన్ అధికారులదే అని ఆయన అన్నారు.