దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు

GNTR: గజపతినగరం రైల్వే కాలనీలో ఇటీవల జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. దీనిపై సీఐ రమణ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. SI కిరణ్ కుమార్ నాయుడుకు వచ్చిన సమాచారం మేరకు గురువారం గజపతినగరం రైల్వే స్టేషన్ సమీపంలో నలుగురు దొంగలను పట్టుకున్నామన్నారు. వారు గుంటూరుకు చెందినవారని పోలీసులు తెలిపారు.