కోతుల బెడదను అరికట్టాలని వినతి
NRML: కడెం మండలం లింగాపూర్ గ్రామంలో ఉన్న కోతుల సమస్యను పరిష్కరించాలని గ్రామ యువకులు కోరారు. ఈ మేరకు సర్పంచ్ కుమ్మరి రంజిత్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. గ్రామంలో కోతుల బెడదతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి కోతుల బెడద నుండి గ్రామస్తులను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రంజిత్ గౌడ్, మాదాసు రాజు పాల్గొన్నారు.