VIDEO: జిల్లా కలెక్టర్‌గా తమీమ్ అన్సారియా బాధ్యతల స్వీకరణ

గుంటూరు జిల్లా నూతన కలెక్టర్‌గా తమీమ్ అన్సారియా శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు ఆమెకు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. తదుపరి ఆమె జిల్లా అభివృద్ధి, ప్రజాసేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తానని, ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండే పరిపాలన కోసం కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పలు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.