'21న ప్రతి గ్రామంలో ముదిరాజ్ జెండా ఆవిష్కరించాలి'

'21న ప్రతి గ్రామంలో ముదిరాజ్ జెండా ఆవిష్కరించాలి'

SRD: ముదిరాజ్ సంఘం వార్షికోత్సవం సందర్భంగా ఈనెల 21వ తేదీన అన్ని గ్రామాల్లో జెండాలు ఆవిష్కరించాలని మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు మందుల వరలక్ష్మి అన్నారు. సంగారెడ్డిలోని సంఘ భవనంలో మంగళవారం అందుకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ వేడుకలకు ముదిరాజ్ కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.