VIDEO: భక్తి శ్రద్ధలతో ఏకాదశి పూజలు
SKLM: కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా శనివారం ఆమదాలవలస పట్టణం, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పలు శివ, విష్ణు ఆలయాల్లో పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ముందుగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేకంగా అలంకరించి వేదమంత్రాలతో పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారికి పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు.