రైతన్న మీ కోసం ప్రధాన ఉద్దేశ్యం ఇదే: కలెక్టర్
ELR: వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా చేసేందుకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతుల ఇంటివద్దకు వెళ్లి అవగాహన కలిగించడమే 'రైతన్న మీ కోసం' కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని కలెక్టర్ వెట్రిసెల్వి చెప్పారు. పెదపాడు మండలం అప్పనవీడులో బుధవారం జరిగిన 'రైతన్న మీ కోసం' కార్యక్రమంలో అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల పనితీరును కలెక్టర్ పరిశీలించారు.