'15న కోటి సంతకాల భారీ ర్యాలీకి సిద్ధం కండి'
ASR: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణలో అరకు నియోజకవర్గం నుంచి సుమారు 53వేల సంతకాలు సేకరించిన కార్యకర్తలకు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ధన్యవాదాలు తెలిపారు. మాజీ సీఎం జగన్ ఆదేశాల మేరకు ఈనెల 15న ఉదయం 10 గంటలకు పాడేరు జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి కరపత్రాలను తాడేపల్లికి తరలిస్తామని తెలిపారు.