అక్రమంగా మట్టి రవాణా.. వాహనాలు సీజ్

అక్రమంగా మట్టి రవాణా.. వాహనాలు సీజ్

ELR: బుట్టాయిగూడెం మండలం బుసరాజుపల్లి వద్ద చింతలపూడి ఎత్తుపాతుల పథకం కాలువ గట్టును తవ్వేసి, అక్రమంగా మట్టిని రవాణా చేస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న ఇరిగేషన్ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీబీని, అలాగే మట్టిని రవాణా చేస్తున్న టిప్పర్ లారీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ వాహనాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.