VIDEO: తుమ్మలను బీఆర్ఎస్ వదులుకోవడం పెద్ద తప్పు
KMM: జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని, తుమ్మల నాగేశ్వరరావు వంటి సీనియర్ నాయకుడిని దూరం చేసుకోవడం పెద్ద తప్పని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. పార్టీలో తనపై కుట్ర చేసి బయటకు పంపారని ఆరోపించారు. ఉద్యమ నాయకులను కూడా ఇబ్బందులు పెట్టారని, కాలమే అన్నింటికి సమాధానం చెబుతుందన్నారు.