పేకాట స్థావరాలపై పోలీసుల దాడి

KMM: తిరుమలాయపాలెం మండల పరిధిలోని ఎదులచెరువు గ్రామంలో గుట్టు చప్పుడు కాకుండా ఓ నివాస గృహంలో పేకాట ఆడుతున్నారని పక్క సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం మెరుపు దాడి చేశారు. సుమారు ఎనిమిది మంది పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నటు సమాచారం. వీరితో పాటు ఒక కారు, మూడు ద్విచక్ర వాహనాలు, రూ.30,500 వేల నాగదును స్వాధీనం చేసుకున్నారు.