ఫర్టిలైజర్స్ దుకాణం తనిఖీ

ADB: ఉట్నూర్‌లోని వివిధ ఫర్టిలైజర్స్ దుకాణాలను మంగళవారం సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్ తనిఖీ చేశారు. ఈసందర్భంగా రిజిస్టర్లను తనిఖీ చేసి దుకాణాల్లో ఉన్న వివిధ మందుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే దుకాణాల్లో రిజిస్టర్లను మెయింటెయిన్ చేస్తూ రైతులకు అందించే వివరాలను తప్పకుండా నమోదు చేసుకోవాలన్నారు. అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.