అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం
అన్నమయ్య: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని పెద్దమండెం మండల కేంద్రంలో ఉన్న భవిత పాఠశాలలో దివ్యాంగుల దినోత్సవాన్ని బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో మనోహర్ రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దివ్యాంగులు ప్రపంచ స్థాయిలో అన్ని రంగాలల్లో పోటీ పడుతున్నారని తెలిపారు.