కురుబలు రాజకీయంగా ఎదగాలి: ఎమ్మెల్యే
సత్యసాయి: కురుబ కులస్తులు ఆర్థిక, సామాజిక, రాజకీయరంగంలో ఉన్నతస్థాయికి ఎదగాలని పెనుకొండ మాజీ ఎమ్మెల్యే శంకర్ నారాయణ తెలిపారు. శనివారం రొద్దం మండలం కలిపి గ్రామంలో నిర్వహించిన శ్రీ భక్త కనకదాస విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వైసీపీ నాయకులతో కలసి శ్రీ భక్త కనకదాసు విగ్రహానికి నివాళులర్పించారు.